Surprise Me!

రాజస్థాన్‌లో చెన్నై పోలీస్ ఇన్‌స్పెక్టర్‌‌పై కాల్పులు, వీడియో | Oneindia Telugu

2017-12-13 122 Dailymotion

48-year-old police inspector from Chennai was lost life by burglars in a village in Pali district of Rajasthan <br /> <br />చెన్నైలో గత నెలలో జరిగిన బంగారం దొంగతనం కేసులో అనుమానితులను పట్టుకునేందుకు తమిళనాడు పోలీసు బృందం రాజస్థాన్‌లోని పాలి జిల్లాకు వెళ్ళింది. కాగా కొందరు దుండగులతో జరిగిన కాల్పుల్లో చెన్నైలోని మధురవోయల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు ఇన్‌స్పెక్టర్ పెరియపండి ని రాజస్థాన్‌లో కాల్చి చంపారు. బుధవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది. మరొక ఇన్‌స్పెక్టర్ ముని శేఖర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. <br />వివరాల్లోకి వెళితే నవంబరు 16న తమిళనాడులోని ఓ ఆభరణాల దుకాణం నుంచి బంగారం దొంగతనం జరిగింది. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందం రాజస్థాన్‌ వెళ్ళింది. వీరిని చూసిన నిందితులు రాళ్ళు, ఇనుప చువ్వలతో దాడి చేశారని సమాచారం. ఇక ఒక అనుమానితుడిని పట్టుకోవడానికి పెరియపండి పరుగెత్తుతూ వెళ్ళినపుడు, ఆయనపై ఆ అనుమానితులు కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. <br />

Buy Now on CodeCanyon